మనీ: కేవలం రూ.165 లతో కోటీశ్వరులు అవ్వచ్చు.. అదెలానో తెలుసా..?

Divya

ఏంటి కేవలం 165 రూపాయలు ఉంటే చాలా .. కోటీశ్వరులు అవ్వచ్చా..?  అని ప్రతి ఒక్కరికి సందేహం కలగవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ  తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రాబడిని పొందాలి అని అనుకుంటుంటారు. అందులో భాగంగానే పోస్ట్ ఆఫీస్ లు , కేంద్రం అలాగే పలు బ్యాంకులు కూడా తమ కస్టమర్ల కోసం సరికొత్త స్కీం లను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే  ఉంటాయి. అందులో భాగంగానే ఐసిఐసిఐ బ్యాంకు కూడా తన కస్టమర్ల కోసం సరికొత్త స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది.. అయితే ఆ స్కీం వివరాలు ఏంటి..?  అందులో డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలి..?  అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ జరిగే తెలుసుకుందాం..
సాధారణంగా ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కాలపరిమితి ముగిసే సరికి, ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ముఖ్యంగా ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంకు ల వంటి బ్యాంకులలో మ్యూచువల్ ఫండ్స్ లో  డబ్బును ఇన్వెస్ట్ చేయడం వల్ల ,ఎక్కువ మొత్తంలో రాబడిని పొందే అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్ట్మెంట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఎస్బిఐ లో కానీ ఐసిఐసిఐ బ్యాంకులో కానీ రోజుకు 165 రూపాయల చొప్పున ఆదా చేసి, మొత్తం నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే , తక్కువ అమౌంట్ తోనే కాలపరిమితి ముగిసే సరికి ఎక్కువ రాబడిని పొందవచ్చు.

అంటే నెలకు ఐదు వేల రూపాయల చొప్పున 25 సంవత్సరాల ఇన్వెస్ట్ చేస్తే, ఆ తరువాత ఏకంగా 1.6 కోట్ల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. అంటే 15 శాతం రాబడిని పరిగణలోకి తీసుకుంటే , ఈ మొత్తం మనకు వస్తుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ కింద 5  సంవత్సరాల రాబడి 26 శాతంగా ఉండగా,  ఇందులో కనీసం 100 రూపాయల నుంచి సులభంగా ఇన్వెస్ట్ చేసే వీలు ఉంటుంది.

ఇక ఎస్బిఐ బ్యాంకు స్కీం ల  విషయానికొస్తే, ఎస్బిఐ ఆపర్చునిటీ టెక్నాలజీ ఫండ్ లో  రోజుకు కనీసం 500 రూపాయల నుండి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా, ఇక ఈ స్కీమ్లో కేవలం అయిదు సంవత్సరాలలోనే 22 శాతం రాబడిని పొందే అవకాశం ఉంటుంది. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడిని పొందే ఈ స్కీమ్లో , సామాన్యులు చేరడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఏదిఏమైనా రోజుకు తక్కువ మొత్తంలో ఆదా చేసుకోవడం పెద్ద కష్టం అనిపించదు.. కాబట్టి ఈ స్కీమ్ ల పై ఆసక్తి ఉన్నవారు సంబంధించిన బ్యాంకులకు వెళ్లి వాటి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: