మనీ: కార్లపై కూడా డబ్బు ఆదా చేయవచ్చా..?

Divya

సాధారణంగా కార్లను కొనుగోలు చేయాలి అంటే సామాన్యులకు అతికష్టం మీద మారిన పని. అయితే ఇలాంటి వాళ్ల కోసమే కాకుండా,  కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరోసారి తీపి కబురు చెప్పింది. అదేమిటంటే ..ఇటీవల లాంచ్ చేసిన థార్ మోడల్ మినహా అన్ని కార్లపై భారీ తగ్గింపు ధరను ప్రకటించింది. Bs6 కార్లను భారీ డిస్కౌంట్ ధరలతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక వినియోగదారులు ఈ ఆఫర్లో దాదాపుగా రూ. 3.06 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

అయితే ఈ డిస్కౌంట్ రేట్లు ఈ నెల 30 వరకు అందుబాటులో ఉన్న నున్నట్లు మహీంద్రా సంస్థ తెలిపింది.. అయితే అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆయా డీలర్ల పరిధిలో ఈ తగ్గింపు లో స్వల్పమార్పులు ఉండవట ఆసక్తి ఉన్నవారు కొనుగోలుదారులు ఎవరైనా ఉంటే కేయూవీ 100 ఎన్ఎక్స్టీ నుండి అల్ట్రా స్ జీ4 ఫ్లాగో షిప్  ఎస్ యూ వీ  వరకు పలు మోడళ్ల కార్లపై నగదు ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు..

ప్రత్యేకించి అల్ట్రా స్ జీ4 ఫ్లాగోషిప్  ఎస్ యూ వీ  కొనుగోలు పై మొత్తం రూ. 3.0 6 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ.2.2 లక్షల వరకు నగదు ఆఫరు, అలాగే   రూ.50 వేల వరకు,  ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి.. ఇక కార్పొరేట్ ఆఫర్ కింద రూ. 16,000 , ఇతర ప్రయోజనాల ఆఫర్ల కింద రూ.20, 000 వరకూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి..
మరాజ్జో ఎం పీ వీ లో అందించే గరిష్ట తగ్గింపు 41 వేల రూపాయలు ఉంది. ఇందులో 20 వేల రూపాయల వరకు నగదు ప్రయోజనాలు , ఎక్స్చేంజ్ కింద రూ.15 వేల వరకు , అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.6 వేల వరకు లభిస్తాయి.. మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైతే ఈ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు ఈ ఆఫర్లను పొందవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: