మనీ : అంబానీ సోదరులకు ఏకంగా 25 కోట్ల రూపాయల జరిమానా..
అంబానీ సోదరుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మరీ ముఖ్యంగా ముఖేష్ అంబానీ భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధ్యక్షుడు అలాగే యాజమాన్య సంచాలకుడు. మొత్తం 35 శాతంతో అత్యధిక వాటాదారులు గా ఉన్నాడు. రిలయన్స్ సంస్థ ఫార్చ్యూన్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారత దేశ రెండవ అత్యంత విలువైన సంస్థ గా నిలిచింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత విలువైన బిల్డింగ్ లో నివసిస్తున్న వ్యక్తి గా అంబానీ నిలిచాడు. ఈ ఇల్లు సుమారు రెండు బిలియన్ డాలర్లు. సోదరుడు అనిల్ అంబానీ. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పని చేస్తుంది. వ్యాపారులకు అనుబంధంగా ఈ సంస్థ వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది..
2013లో భారత దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు ముఖేష్ అంబానీ . ఇలా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అంబానీ సోదరులకు ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అదేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
రెండు దశాబ్దాలకు పూర్వం జరిగిన ఒక కేసులో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తో పాటు మరికొంతమందికి కలిపి మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ 25 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5 శాతానికి పైగా వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు,పీ ఏ సీ వివరాలు అందించడంలో విఫలమైనట్లు తాజాగా పేర్కొంది. ఇక దీనితో టేకోవర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అంబానీ బ్రదర్స్ తోపాటు ముఖేష్ భార్య నీతా అంబానీ, అనిల్ భార్య టీనా అంబానీ మరికొన్ని సంస్థలపై జరిమానా కూడా విధించింది సెబీ సంస్థ.
వారంట్ల తో కూడిన రీడీమబుల్ డిబేంచర్ల ద్వారా ఆర్ ఐ ఎల్ ప్రమోటార్లు, పీఏసీ 6.8 మోడీ శాతం ఈక్విటీ కి సమానమైన షేర్ లను సొంతం చేసుకున్నాయి. ఐదు శాతం వాటా కలిగించిన ఈ లావాదేవీలు టేకోవర్ నిబంధనల ప్రకారం 2000 జనవరి 7న కంపెనీ పబ్లిక్ గా ప్రకటించాల్సి ఉన్నట్లు పేర్కొంది. వీరు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని తెలియజేసింది. అంబానీ బ్రదర్స్ ఈ నిబంధనలు ఉల్లంఘించారని సెబీ ప్రకటించింది.