మనీ : ప్రతి ఏటా లక్షల్లో ఆదాయం.. ఇందుకు కారణం వరిపొట్టు వ్యాపారం.. దాని వివరాలు ఏంటో తెలుసా..?

Divya

డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నట్టుగానే,  చేస్తున్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా పలు మార్గాలు ఉంటాయి. ఇటీవల కాలంలో చాలా మంది డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.  అందులో కొంత మంది వ్యవసాయం చేస్తే, మరి కొంతమంది వ్యాపారం, మరికొంతమంది ఉద్యోగాలు చేస్తూ, మరి కొంతమంది వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లో ఉండి డబ్బులు సంపాదిస్తున్నారు. మరికొంతమంది వరి పొట్టు నుండి కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. అది కూడా ఎవరూ ఊహించని విధంగా ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.. దాని వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

 సాధారణంగా  వరి పంట అయిన తర్వాత మిగిలిన గడ్డిని పశువులకు దాణాగా వేస్తారు. ఇక బియ్యాన్ని మనం ఆహారంగా తీసుకుంటాము. అయితే వరిపొట్టు వల్ల ఏం లాభాలు కలుగుతాయి అని చాలా మందికి సందేహం కూడా వుంటుంది. కానీ ఈ వరిపొట్టు వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. వీటిని అమ్మే ప్రస్తుతం కొంతమంది వ్యాపారులు లాభార్జన పొందుతున్నారు..

పూర్తి వివరాల్లోకి వెళితే ..ఒడిశాలోని కలహందిలో బిభు సాహు అని ఒక ఉపాధ్యాయుడు, 2007లో తన చేసే ఉద్యోగాన్ని మానేశారు. ఆ తర్వాత అగ్రి బిజినెస్‏లోకి అడుగులు వేశారు. దీంతో మెల్లగా రైస్ మిల్లు వ్యాపారంలోకి ప్రవేశించాడు. రైస్ మిల్లు వ్యాపారంతో ప్రతి సంవత్సరం దాదాపు 3 టన్నుల వరకు వరి పొట్టు వచ్చేది. దానిని ఏం చేయాలో తెలియాక బీబీ సాహు ఊరి బయట ఆ వరిపొట్టును కాల్చివేసేవారు. దీంతో  వరి పొట్టు కాలడం వల్ల వచ్చే పొగ కారణంగా  వాతావారణ కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతోంది అంటూ  చుట్టుపక్కల వారు వచ్చి ఫిర్యాదు చేసేవారు. మళ్లీ ఆ వరిపొట్టును ఏం చేయాలో తెలియక ఒక వేర్ హౌస్‏లో ఆ పొట్టును దాచేవారు. క్రమంగా అది కూడా నిండిపోయింది. ఈ పరిస్థితితో దాన్ని ఏం చేయాలా..? అని సాహు రీసెర్చ్ చేశాడు.

అందులో భాగంగానే  ఆ వరిపొట్టును స్టీల్ పరిశ్రమలో థర్మల్ ఇన్సులేటర్‏గా వాడొచ్చు అని తెలిసింది. కానీ దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో సాహుకు అర్థం కాలేదు. ఇక ఇదే విషయమై సాహు చాలా మంది నిపుణులను కలిశాడు. కానీ ఎలాంటి  ప్రయోజనం లేకపోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సాగర్ స్నేహితుడు తనకు కొంచెం గడువు కావాలని ఊరికి వెళ్ళాడు.  అక్కడి నుండి మరో నలుగురు స్నేహితులను తీసుకొచ్చాడు. వీరందరూ కలిసి ఈ వరి పొట్టు ను చిన్న చిన్న గుళికలు, గుండ్లు లాగా తయారు చేశారు. ఇక వాటిని సాహూ విదేశాల్లోని కొన్ని కంపెనీలకు మెయిల్ చేశాడు. 2019 లో తొలి లోడు ను సౌదీ అరేబియాకు పంపించాడు. ఇక అదే సంవత్సరంలోనే వంద టన్నుల గుళికలని అమ్మి, ఏకంగా ఎవరూ ఊహించని విధంగా రూ.20 లక్షలు సంపాదించారు. ప్రస్తుతం  అదే పద్ధతిని పాటిస్తూ,  ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు సాహూ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: