మనీ : మీరు రోజుకు 9 గంటలు హాయిగా నిద్ర పోతున్నారా..? అయితే రూ. 10 లక్షల నగదు బహుమతి మీకే..!

Divya

ఏంటి రోజుకు 9 గంటలు నిద్రపోతే.. పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారా.. ఇదెక్కడి  విడ్డూరం.. మామూలుగా రోజుకు 9 నుండి 10 గంటలు కష్టపడి పని చేస్తూ, నెల రోజుల పాటు  కష్టపడిన అంత జీతం రాదు. అలాంటిది ఏకంగా తొమ్మిది గంటలు నిద్రపోతే పదిలక్షల బహుమతి ఇస్తారా. ఏంటి జోక్ గా ఉందా.. అని విమర్శిస్తున్నారా .. నిజమండీ.. రోజుకు 9 గంటలు నిద్ర పోతే.. మీకు రూ.10 లక్షల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం పొందవచ్చు.. అయితే అది ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..


వేక్ ఫిట్ ఇంటర్న్షిప్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అది ఏమిటంటే వేక్ ఫిట్ ఇంటర్న్షిప్ లో నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఇక్కడ నిద్రపోవడమే పని. సాధారణంగా నిద్రపోతే ఏం పని పాట లేదా అని ఎవరో ఒకరు విమర్శిస్తూ ఉంటారు. ఇక ఇది చూసినవారంతా మిమ్మల్ని నిద్ర తప్ప మరో పని పాట లేదా నిద్ర పోయి డబ్బులు పోగు చేసుకోవచ్చు కదా అని అనడం మొదలుపెడతారు.. అయితే ఈ కంపెనీ వారు మనకు డబ్బులు ఎలా ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..


వేక్ ఫిట్ బ్యాచ్ 2021 - 2022 స్లీప్ ఇంటర్న్షిప్ మీకోసమే తీసుకొచ్చింది. అయితే ఇందులో మీరు చేయవలసిందల్లా రోజుకు 9 గంటలు నిద్ర పోవాలి. 100 రోజులు అలా చేయగలిగితే మీకు అక్షరాలా పది లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. మీరు ఎప్పుడైనా నిద్రపోతూ డబ్బులు సంపాదించి పెడితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం. అయితే ఇంటర్న్షిప్ లో పాల్గొనేవారు ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా రోజుకు తొమ్మిది గంటల సేపు నిద్ర పోవాలి అంతే. ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో, ఎవరైతే బాగా నిద్ర పోతారో, వారిలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేసుకొని 100 రోజులపాటు ఇంటర్న్షిప్  కు అర్హత కల్పిస్తారు. ఇందులో ఎంపికైన వారందరికీ లక్ష రూపాయల చొప్పున లభిస్తాయి. అయితే గెలిచిన వారికి మాత్రం ఏకంగా పది లక్షల రూపాయలు వస్తాయి.


మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఇంటర్నెట్ లో భాగం కావాలి అనుకుంటే..https://wakefit.co/sleepintern వెబ్‌సైట్‌ను సందర్శించి డీటైల్స్ ఫిల్ చేయండి.  కాంపిటిషన్‌లో పాల్గొనేవారు  టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పష్టంగా ఒకటికి రెండుసార్లు చదువుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: