డబ్బే డబ్బు : లాభాల దశమి కి పడిన బ్రేక్ !

Seetha Sailaja
వరసగా 10 రోజులు పరుగులు తీసిన స్టాక్ మార్కెట్ తీరును చూసి మార్కెట్ విశ్లేషకులు కూడ ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయ సంకేతాలు స్తబ్దంగా ఉన్నప్పటికీ పాశ్చాత్య దేశాలలో కరోనా -2 కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ఇండియన్ స్టాక్ మార్కెట్ పరుగులు తీయడం చూసి విశ్లేషకులు కూడ ఆశ్చర్యపోయారు.


రికార్డ్ స్థాయికి సూచీలు చేరుకొని నిఫ్టీ 14,200 స్థాయికి చేరుకోవడంతో ఇక స్టాక్ మార్కెట్ ర్యాలీకి ఎదురులేదు అని అనుకున్నారు అంతా. కేవలం ఒక్క మంగళ వారంనాడు రికార్డు స్థాయిలో సూచీలు పరుగులు తీయడంతో మదుపర్ల సంపద ఒక్క రోజులోనే 192.87 లక్షల కోట్లకు చేరుకొని నిన్నటి బుధ వారం పై ఎన్నో ఆశలను మదుపర్లు పెట్టుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒడుదుడుకులకు లోని నిఫ్టీ బిఎస్ఇ ఎక్సేంజ్ లలో షేర్లు ఊహించని పతనాన్ని చవిచూసాయి.


ఇలా బ్రేక్ పడటానికి లండన్ లో మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించడంతో పాటు రోజురోజుకీ కరోనా కేసులు పాశ్చాత్య దేశాలలో పెరుగుతూ ఆ భయాలు ఇండియాలో కూడ వ్యాపించడం అని అంటున్నారు. 10 రోజులపాటు కొనసాగిన ర్యాలీకి బ్రేక్ పడి చిన్న కంపెనీల షేర్లతో పాటు పెద్ద కంపెనీల షేర్లు కూడ పడిపోవడంతో మార్కెట్ సెంటిమెంట్లో తేడాలు వచ్చి మదుపర్లు భారీ స్థాయిలో తమ షేర్లను అమ్మకానికి పెట్టడంతో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది.


అయితే ఇది అంతా తాత్కాలికమే అనీ మళ్ళీ మార్కెట్ సెంటిమెంట్ పుంజుకుంటుంది అనీ షేర్ ఎక్స్ పర్ట్ ల అభిప్రాయం. ఇది ఇలా ఉంటే భారత్ లో ఈనెల జనవరి 30 నుండి కరోనా టీకా పంపిణీకి రంగం సిద్ధం అవ్వడమే కాకుండా ఈ టీకా పంపిణీకి కలిసి పనిచేస్తాం అని భారత్ బయోటిక్ సీరం సంస్థల అధినేతలు ఒక అవగాహనకు రావడంతో తిరిగి మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా మెరుగుపడే ఆస్కారం కనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: