డబ్బే డబ్బు : కోలుకుంటున్న భారత్ ఆర్ధిక వ్యవస్థ !
భారత్ ఆర్ధిక వ్యవస్థ జీడీపీ క్రమంగా కోలుకుంటోంది అనీ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్ వెల్లడించిన నివేదిక భారత్ లో ఇన్వెస్టర్స్ లో ఉత్సాహాన్ని పెంచుతోంది. వాస్తవానికి భారత్ లో కరోనా పరిస్థితుల నేపధ్యంలో జీడీపీ 14.8 శాతం క్షీణించ వచ్చని గతంలో అంచనాలు వస్తే ఇప్పుడు ఆ క్షీణత 10.8 శాతానికి పరిమితం కావడంతో భారత ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటోంది అని గోల్డ్ మ్యాన్ శాక్స్ అభిప్రాయం.
వచ్చే సంవత్సరం నుంచి ఇండియాలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ఈ నివేదిక అభిప్రాయ పడుతోంది. ఇది ఇలా ఉంటే మనదేశాన్ని అంతర్జాతీయ పెట్టుబడి కేంద్రంగా మార్చడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టమని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన భారత్ లోని ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్ లో విద్య ఆరోగ్యం సంరక్షణ షాపింగ్ లాంటివి అన్నీ ఆన్ లైన్ లోనే జరగబోతున్నాయని ప్రధాని చెపుతున్న అంచనాలు వల్ల దేశంలో ఆన్ లైన్ బిజినెస్ మరింత వృద్ధి చెందబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలు డబ్బున్న వ్యాపారులకు అనుకూలంగా ఉన్నాయని డబ్బున్న వ్యాపారులు తమ లాభాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు కానీ తమ జాతి ప్రజల క్షేమం గురించి అంతగా ఆలోచించరు అలాంటి వారి చేతిలో ఆర్ధిక వ్యవస్థ వెళ్ళడం ప్రమాదకరం అంటూ మాల్కోం ఆదిశేషయ శామాజిక శాస్త్రాల అధ్యయన సంస్థ అధినేత ఒక వ్యాసంలో చేసిన కామెంట్స్ అనేక చర్చలకు తావు ఇస్తున్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రవేటీకరణ విధానాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనీ ఆ విధానాలను ఇప్పుడు భారతీయ జనతాపార్టీ కొనసాగిస్తూ ఈ రెండు పార్టీలు లాభాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రవేటు వ్యక్తుల చేతులలో అత్యంత విచారకరం అంటూ భవిష్యత్ లో విద్యుత్ రంగం కూడ చిన్నాభిన్నం అయ్యే ఆస్కారం ఉంది అంటూ మరికొంతమంది ఆర్ధిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా గడిచిన దీపావళి దసరా సీజన్ లో దాదాపు 72 వేల కోట్లకు పైగా ఎలాట్రానిక్ కన్జ్యూమార్ వస్తువులు అమ్మకాలు జరగడంతో ప్రజలు దేశ అభివృద్ధి గురించి ఆలోచనలు చేయడంకన్నా తమ అవసరాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనిపిస్తోంది..