డబ్బే డబ్బు : రిలయన్స్ ఫ్యూచర్ కంపెనీల స్నేహానికి అడ్డు తగులుతున్న అమెజాన్ !
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ వ్యూహాలకు అమెజాన్ సంస్థ అడ్డు తగలడం పారిశ్రామిక వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత పెంచుకోవడానికి ఫ్యూచర్ గ్రూప్ సంస్థతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ ఫ్యూచర్ సంస్థ రిలియన్స్ తో ఒప్పందం చేసుకునే ముందుగా తమతో ఒప్పందం చేసుకుందని ఆ ఒప్పందం రద్దు కాకుండా ఇప్పుడు రిలియన్స్ తో ఒప్పందం చేసుకోవడం అది వ్యాపార ఉల్లంఘన అంటూ అమెజాన్ ఫ్యూచర్ సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈవివాదం పై స్పందించడానికి ఫ్యూచర్ సంస్థ అధికారులు ఆశక్తి కనపరచనప్పటికీ ఈవిషయంలో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
వాస్తవానికి ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన రిటైల్ టోకు లాజిస్టిక్ వ్యాపారాలను కొనుగోలుచేయడానికి రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చే ముందే 2019 లో అమెజాన్ ఫ్యూచర్ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు అమెజాన్ బాదిస్తోంది. అయితే ఈ ఒప్పందం ఇంకా రద్దు కాకుండానే ఫ్యూచర్ సంస్థ రిలయన్స్ తో 24,713 కోట్లకు ఒప్పందం ఎలా చేసుకుంటుంది అంటూ అమెజాన్ ప్రశ్నిస్తోంది. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉన్న పరిస్థితులలో అమెజాన్ ఫ్యూచర్ సంస్థల ఒప్పందానికి న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడతాయ అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవానికి భారతదేశంలో వేలకోట్ల వ్యాపాత్సం కొనసాగిస్తున్న అమెజాన్ తన వ్యాపార కార్యకలాపాలను అభివృద్ధి చేసుకోవడావికి భారీ ప్రణాళికలు వేస్తూ రాబోతున్న దసరా దీపావళి సీజన్ లో వందల కోట్ల బిజినెస్ పై కన్నీసి అనేక ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పుడు తమ భవిష్యత్ ప్రణాళికలకు ఫ్యూచర్ అమెజాన్ సంస్థల సరికొత్త వ్యూహాత్మక భాగాస్వాయం అడ్డుకట్ట వేస్తుందనీ అమెజాన్ భావిస్తున్నట్లు అందరికీ అర్థం అవుతోంది. మరి ఈ సమస్యను ఫ్యూచర్ రిలయన్స్ సంస్థలు ఎలా పరిష్కరిస్తాయో చూడాలి..