డబ్బే డబ్బు : రాజకీయ పార్టీల ఖర్చులు నియంత్రించబోతున్న ఎయిర్ టెల్ బ్లూజీన్స్ ఆవిష్కరణ !
కరోనా వాతావరణంలో అనేక రంగాలలో ఊహించని విప్లవాత్మక మార్పులు చాల వేగంగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో దృశ్యమాధ్యమ సమావేశాల కోసం ఎయిర్ టెల్ నూతనంగా ఆవిష్కరింపబోతున్న కొత్త యాప్ తో ఒకేసారి 50 వేలమంది వరకు ఆన్ లైన్ సమావేశాలలో చాల సులువుగా పాల్గోనచ్చు.
అమెరికా టెలికాం దిగ్గజం వెరీ జోన్ భాగస్వామ్యంతో రూపకల్పన చేయబోతున్న ఈ వేదిక రానున్న రోజులలో రాజకీయ పార్టీలకు వరంగా మారుతుంది. ప్రస్తుతం ఎన్నికలు వచ్చాయి అంటే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి జనానికి డబ్బులు పలావ్ ప్యాకేట్స్ ఇచ్చి వాహనాలలో జనాలను తీసుకు రావలసిన పరిస్థితులు ఏర్పడటంతో భారతదేశంలో ఎన్నికల ప్రచారం ఒక ఖరీదైన అంశంగా మారింది.
అదేవిధంగా అనేక వాణిజ్య సంస్థలు సమావేశాలు నిర్వహించుకోవాలి అంటే వాటికోసం కూడా చాల ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. ఇప్పుడు ఈ ఖర్చులను అదుపులో పెడుతూ ఒకేసారి ఒక వ్యక్తి చెప్పే మెసేజ్ ఆన్ లైన్ లో క్షణాలలో 50 వేలమందికి చేరిపోయే ఈ ఎయిర్ టెల్ బ్లూ జీన్స్ ఆవిష్కరణతో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ సంవత్సరం చివరిలో బీహార్ లో అదేవిధంగా వచ్చే ఏడాది సమ్మర్ లో తమిళనాడు పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ ఆవిష్కరణ రాజకీయ పార్టీల ఖర్చులు విపరీతంగా తగ్గిస్తుంది అన్న అంచనాలు కూడ ఉన్నాయి.
కరోనా పరిస్థితులు వల్ల ఎన్ని వ్యాపారాలు దెబ్బ తిన్నా ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకి విపరీతంగా పెరిగిపోయి దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగించే వారి సంఖ్య ప్రతినెలా కోట్లల్లో పెరిగిపోతోంది. దీనితో సమాచార రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని రంగాలలోను ఆన్ లైన్ వ్యాపారానికి ప్రాధాన్యత పెరిగిపోతున్న పరిస్థితులలో భవిష్యత్ లో ఈ రంగాలలో కొన్ని లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అని విశ్లేషకులు అంచనా..