ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో మూవీలు ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడక్షన్ హౌస్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఒకటి. ఇప్పటి వరకు ఈ నిర్మాణ సంస్థలో ఎన్నో సినిమాలు రూపొందాయి. ఇందులో అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా సాధిస్తూ ఉండడంతో ఈ నిర్మాణ సంస్థ చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తిరుగులేని ప్రొడక్షన్ హౌజ్ గా ముందుకు సాగుతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లుగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఇద్దరు దర్శకులతో మూవీ లను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దర్శకులు ఎవరో తెలుసుకుందాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ వారు ఒక భారీ బడ్జెట్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ పోతినేని తో ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత గీత ఆర్ట్స్ లో ఈ దర్శకుడు మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఒకరు. ఈయన గీత ఆర్ట్స్ లో తన తదుపరి మూవీ ని చేయనట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇకపోతే ఆఖరుగా ఈ దర్శకుడు ఏజెంట్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అఖిల్ హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: