దళపతి విజయ్ "లియో" నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
దళపతి విజయ్ తాజాగా వారిసు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... తెలుగు నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించాడు. తమిళం లో వారసు పేరుతో విడుదల అయిన ఈ సినిమా తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు ... తమిళ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. వారసు లాంటి విజయవంతమైన మూవీ తర్వాత ఈ నటుడు ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందిన మాస్టర్ మూవీ రూపొంది మంచి విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో ప్రస్తుతం రూపొందుతున్న లియో మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఒక వీడియోను విడుదల చేయగా ... ఆ వీడియో అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ రేపటి నుండి చెన్నై లో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్.లో మూవీ బృందం ఒక సాంగ్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ ఈ సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: