ఆడియో రైట్స్ విషయంలో.. ఆల్ టైం రికార్డ్ కొట్టిన పుష్ప?

praveen
టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సినీ లవర్స్ అందరిని కూడా ఉర్రూతలూగించింది ఈ సినిమా. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు ఈ సినిమాలోని పాటలు అయితే చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని కూడా కాలు కదిపేలా చేశాయి అని చెప్పాలి.

 లెక్కల మాస్టర్ సుకుమార్ టేకింగ్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు   ఓవరాల్ గా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది ఈ మూవీ. అయితే ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాకు సీక్వల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే పుష్ప 2 సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేయక ఇది అభిమానులు అందరిలో కూడా అంచనాలను డబుల్ చేసేసింది. దీంతో పుష్ప 2 కోసం యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎదురుచూస్తుంది అని చెప్పాలి.

 ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే పుష్ప 2 ఆడియో రైట్స్ విషయంలో కొత్త రికార్డులు సృష్టించింది అని తెలుస్తుంది. టి సిరీస్ సంస్థ తెలుగు తో పాటు విడుదలయే అన్ని భాషల పుష్ప 2 ఆడియో రైట్స్ దక్కించుకుందట. ఏకంగా దీనికోసం 65 కోట్లు పెట్టిందట టి సిరీస్ సంస్థ. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాకు కూడా ఆడియో రైట్స్ కి కేవలం 30 కోట్లే వచ్చాయి. కానీ పుష్ప 2 కు మాత్రం ఏకంగా 65 కోట్లు రావడం గమనార్హం. దీనికి కారణం పుష్ప సినిమానే కాదు అంతకు ముందు నుంచి కూడా దేవి శ్రీ, సుకుమార్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. అందుకే టి సిరిస్ సంస్థ ఇంత పెద్ద మొత్తం పెట్టేందుకు కూడా వెనకడుగు వేయలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: