మహానటి పై ప్రశంసల వర్షం కురిపించిన కమల్ హాసన్....!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమా లలో నటిస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే.ఇటీవల దసరా సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా లో నటిస్తోంది.తెలుగులోనే కాకుండా కోలీవుడ్ సినిమా లలో కూడా నటిస్తోంది.తమిళం లో మామన్నన్ మూవీ లో నటించింది.డైరెక్టర్ మరి సెల్వరాజ్ రూపొందించిన ఈ మూవీ లో ఉదయ నిధి స్టాలిన్ హీరో గా నటించారు.
ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తాజాగా చెన్నై లో ఘనం గా నిర్వహించారు.ఈ వేడుక కు తమిళ్ సినీ ప్రముఖు లలో ఒకరైన కమల్ హాసన్ ముఖ్య అతిథి గా హాజరయ్యారు.ఈ సందర్భం గా కమల్ మాట్లాడుతూ కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్బం గా కమల్ హాసన్మాట్లాడుతూ.మామన్నన్‌ సినిమా భారీ విజయం సాధించాలని నా కోరిక.ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి.మరి సెల్వరాజ్ ఇతరులు అభిప్రాయాల కు విలువ ఇస్తారు.
ఆయన లో అదే నాకు చాలా ఇష్టం.ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను అని తెలిపారు.అనంతరం కీర్తి సురేష్ గురించి మాట్లాడుతూ.కీర్తి గొప్ప నటి. ఆమె బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కితాబిచ్చారు.అలాగే ఈ సినిమా లో నటించేందుకు కీర్తి ఒప్పుకోవడం ప్రశంసించదగిన విషయం అని తెలిపారు కమల్ హసన్.ఇకపోతే కీర్తి సురేష్ విషయాని కి వస్తే.ఇటీవల కాలం లో ఈ ముద్దుగుమ్మ తన స్పీడ్ ని పెంచేసింది.నాని కీర్తి సురేష్ కలిసి నటించిన దసరా సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సినిమా తో సూపర్ హిట్ సినిమా ను తన ఖాతా లో వేసుకుంది కీర్తి సురేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: