బాలయ్య కోసం క్యూ కడుతున్న కుర్ర డైరెక్టర్లు..?

Anilkumar
అఖండ, వీర సింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. అఖండ కంటే ముందు 30 కోట్లు ఉన్న మార్కెట్ కాస్త 70 కోట్లకు పెరిగిపోయింది. కరోనా లాంటి టైం లో కూడా అఖండ మూవీతో 75 కోట్ల షేర్ వసూలు చేసి బాలయ్య తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో 'వీరసింహారెడ్డి' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో ఇప్పుడు బాలయ్యతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులు అందరూ బాలయ్య కోసం కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలా ఎఫ్ త్రీ మూవీ తర్వాత అనిల్ రావిపూడి కి 

ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా వాటిని కాదని బాలయ్యతో సినిమా కోసం సుమారు 6 నెలలు వెయిట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో 'NBK108' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మరో హీరోయిన్ శ్రీ లీల ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో రూపొందున్న ఈ సినిమాలో బాలయ్యను చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి. ఒక జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు టీజర్ గ్లిమ్స్ కూడా రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య లైనప్ చూస్తే ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే. అనిల్ రావిపూడి సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలు హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్నాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ రాబోతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబి, బింబిస్తారా డైరెక్టర్ వశిష్ట, జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మలతో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు బాలయ్య. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది బాలయ్య ఒక్కరే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: