ఈసారి హీట్ కొట్టాలని డిఫరెంట్ జోనర్ లో వస్తున్న అక్కినేని హీరోలు..!!

Divya
అక్కినేని ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఈ ముగ్గురు హీరోలు గత కొన్ని ఏలుగా ఫ్లాపులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నాగచైతన్య అఖిల్ తండ్రి నాగార్జున ది ఘోస్ట్ చిత్రంతో పరాజయాలు చూసిన తర్వాత బ్రహ్మాస్త్రం సినిమాలో నటించారు. ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా అభిమానులకు బాగా ఆకట్టుకునేలా చేసింది. హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ఉంటే నాగార్జున మాత్రం లోకలో కూడా సరైన హిట్టు కొట్టలేక పోతున్నారు. దీంతో సాలిడ్ హిట్టు పడితే తప్ప నాగార్జున కు మునుపటిలా క్రేజ్ రాదని చెప్పవచ్చు.

 రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ నాగార్జున ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి.  మలయాళం సినిమాను రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. రెండవ వారంలో ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య కూడా వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. థాంక్యూ, లాల్ సింగ్ చద్ద, కస్టడీ వంటి చిత్రాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు తాజాగా చందు మండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్-2 పైన నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
 మరొకవైపు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కూడా మొదట నుంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం తన కెరీర్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మరో సినిమా అంతగా సాలిడ్ హెడ్ ఇవ్వలేదు. ఈ ఏడాది విడుదలైన ఏజెంట్ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లోనే యువి క్రియేషన్ బ్యానర్లు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరి అక్కినేని హీరోలు ముగ్గురు చాలా డిఫరెంట్ జోనర్ లో వస్తున్నారు.. మరి ఈసారైనా కలిసి వస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: