చక్రవ్యూహం: సినిమా అదిరిందిగా?

Purushottham Vinay
ఇక అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ 'చక్రవ్యూహం'. దీనికి 'ది ట్రాప్' అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రి నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అజయ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చాలా బాగా నటించారు. మాస్ కమర్షియల్ సినిమాలను తీసే మైత్రి మూవీస్ వారు ఈ సినిమా ను తమ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడంతో ఈ "చక్రవ్యూహం" సినిమాపై మరింత ఇంట్రెస్ట్ కలిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.స్ట్రాంగ్ స్టోరీ, ట్విస్టులు ఉన్నప్పుడే థ్రిల్లర్‌ సినిమాలు ప్రేక్షకులను చాలా బాగా ఎంగేజ్‌ చేస్తుంటాయి.ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీల విషయంలో అయితే ఆ హత్యలు ఎవరు చేశారనేది చివరి వరకు రివీల్‌ చేయకుండా.. ప్రేక్షకుడి ఊహలు ఇంకా ఆలోచనలకు అందనంతగా కథను తీర్చిదిద్దాలి. ఈ విషయంలో మాత్రం ఈ సినిమా దర్శకుడు మధుసూధన్ కొంతమేర సఫలమయ్యాడు.ఎందుకంటే అతను ఊహించని ట్విస్టులతో కథను ముందుకు నడిపారు. ఫస్టాఫ్‌లో సిరి మర్డర్ కావడం ఇంకా ఆ కేసును చేపట్టిన సీఐ సత్య, దుర్గ కలిసి చేపట్టే సీన్స్ అయితే సాదాసీదాగాసాగుతాయి.


అలాగే సినిమాలో కేసు విచారణ కూడా ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది.అయితే ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌తో మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని బాగా పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు అయితే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. అసలు హత్యల వెనుక ఉన్నదెవరు? ఎందుకు హత్య చేశారో రివీల్‌ చేసే సీన్స్‌ అయితే ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక సీక్వెల్‌కి ఇచ్చిన లీడ్‌ అజయ్‌ పాత్రపై  బాగా క్యూరియాసిటీని పెంచుతుంది. మొత్తంగా థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడే వారికి చక్రవ్యూహం సినిమా చాలా బాగా నచ్చుతుంది.ఈ సినిమాలో సీఐ సత్యగా అజయ్‌ చాలా బాగా నటించాడు. ఇక ఇలాంటి పోలీసు పాత్రలు పోషించడం అయితే అజయ్‌కి కొత్తేమి కాదు. సీరియస్ రోల్‌లో అతడి డైలాగ్ డెలివరీ ఇంకా ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అలాగే సంజయ్‌గా వివేక్ త్రివేది నటన అయితే బాగుంది. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న శిల్ప పాత్రలో ప్రగ్యా నయన్ చాలా బాగా ఒదిగిపోయింది. . రాజీక్ కనకాల, శుభలేఖ సుధాకర్,ఊర్వశి పరదేశీ ఇంకా జ్ఞానేశ్వరిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. ఇక సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా పర్వాలేదు. అలాగే ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: