నేను స్టూడెంట్ సార్: రెండో సినిమాతో గణేష్ మెప్పించాడా?

Purushottham Vinay
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన  బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటించిన సినిమా నేను స్టూడెంట్ సార్.స్వాతిముత్యం అనే మూవీతో హీరోగా లాంచ్ అయిన గణేష్. తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో  అందరి దృష్టిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'నేను స్టూడెంట్ సర్' అంటూ మరో సినిమా చేశాడు.రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాని సతీష్ వర్మ నిర్మించాడు. మరీ పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.అయితే ట్రైలర్ మాత్రం కొంత ఆకట్టుకునేలా ఉండటం సినిమాపై అంచనాలని పెంచింది.నేడు విడుదల అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.ఈ మూవీ డైరెక్టర్ రాఖీ ఉప్పలపాటి ఒక ఆసక్తికరమైన కథతో వచ్చాడు.అలాగే కథనంలో మలుపులతో ఆకర్షించాడు. ఇక మహతి స్వర సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చింది.


ఇక నటీనటుల విషయానికి వస్తే గణేష్ తన పాత్రతో బాగానే మెప్పించాడు. సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన విలన్ గా చాలా బాగా ఆకట్టుకున్నాడు .. అలాగే అవంతిక దాసాని హీరోయిన్ గా చాలా బాగా అలరించింది ... అలాగే ప్రముఖ నటి భాగ్యశ్రీ కూతురు అయినా ఈమె తన నటనతో చాలా బాగా మెప్పించింది.ఇక సునీల్ కామెడీ విషయానికి వస్తే..కాసేపు మనకి రిలీఫ్ ని ఇస్తుంది. ఇక దర్శకుడు రాఖీ ఉప్పలపాటి కొత్త తరహా కథని ఆకట్టుకునే విధంగా చెప్పడం లో పర్లేదు అనిపించాడు కానీ ఆయన ఇంకా బాగా ఫోకస్ చేసి ఉంటే ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్లి ఉండేది. ఇంకా అలాగే మిగతా వారు ఒకే అనిపిస్తారు. ఇక మొత్తంగా చూస్తే..అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్ప సినిమా ఒకే అనిపిస్తుంది. కానీ రెండవ సినిమాకి సాయి గణేష్ ఈ రకంగా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం మెచ్చుకోదగిన విషయం. మొత్తానికి సినిమా హిట్ అని చెప్పలేం కానీ.యావరేజ్ సినిమా అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: