ఆ స్టార్ హీరోయిన్ కు తల్లిగా నటించబోతున్న సమంత...!!

murali krishna
సమంత  సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది.. ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను అలరించింది.ఆ సినిమా మాత్రం అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ డిజాస్టర్ గా నిలిచింది... అయిన సమంత క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.. అయితే సమంత ఇప్పుడు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకేక్కిస్తున్నారు.. ఈ సిరీస్ గురించి మరో వార్త కూడా వైరల్ అవుతుంది.
వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం.ఇక ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రలో సమంత నటిస్తుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.. ఇక సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్ 5వ ఎపిసోడ్ లో ప్రియాంక చోప్రా యొక్క తండ్రి పాత్రకు డబ్బింగ్ చెప్పడం అయితే జరిగింది.అంటే సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా తండ్రి వరుణ్ దావన్ అని క్లారిటీ కూడా వచ్చింది. ఇక సమంత కూతురు ప్రియాంక చోప్రా అనే సంగతి దీన్ని బట్టి అర్థం అవుతుంది. అయితే, ఇన్నాళ్లు చాలా మంది ఇంగ్లీష్ సిటాడెల్ కు రీమేక్ గా హిందీ సిటాడెల్ రూపొందుతోందని అయితే అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఇంగ్లీష్ సిటాడెల్ కు ప్రీక్వెల్ గా హిందీ సిటాడెల్ రూపొందుతోందని సమాచారం.. అంటే.. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్ ధావన్, సమంత కనిపించబోతున్నారని తెలుస్తుంది.
 సిటాడెల్ లో ప్రియాంక కు ఒక తండ్రి  కూడా ఉంటాడు. అతడు కూడా సిటాడెల్ ఏజెంటే అని, తన కూతురును ఆమె తాత వద్ద పెంచినట్లు కూడా చెప్తుంది. ఇప్పుడు హిందీ వెర్షన్ లో ప్రియాంక తల్లిదండ్రుల కథను అయితే రివీల్ చేస్తారట.. 1990 కాలంలో ఈ కథ నడుస్తుందని సమాచారం.ఇలా ఒక్కొక్కటి లింక్ చేస్తూ ఆ కథను తీసుకొస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: