బొమ్మరిల్లు మూవీని నేను ఆ స్టార్ హీరోలతో చూశాను... అప్పుడు ఎలాంటి హడావిడి లేదు... సిద్ధార్థ్..!

Pulgam Srinivas
తమిళ , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించాడు. అందులో భాగంగా ఈ నటుడు నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అలా ఈ నటుడి కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో బొమ్మరిల్లు మూవీ ఒకటి.

ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో సిద్ధార్థ్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యులో భాగంగా ఈ నటుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ... బొమ్మరిల్లు మూవీ ని నేను ... తారక్ , మహేష్ కలిసి చూసాం. అప్పుడు ఎలాంటి హడావిడి లేదు. కానీ ఇప్పుడు అలా జరగడం చాలా కష్టం. ఎందుకంటే హీరోలు కలుస్తున్నారు అంటే వందల మంది మైకులు పట్టుకుని వచ్చేస్తున్నారు. దానికి పొలిటికల్  కెరియర్ ను యాడ్ చేస్తున్నారు. ఈ తలనొప్పి ఎందుకు అని చాలా మంది హీరోలు కలవడం లేదు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో నటించిన టక్కర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: