బాలయ్య బాబు మూవీ లో ఆ సీన్స్ అద్భుతం అంట....!!

murali krishna
నందమూరి బాలకృష్ణబ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమా లతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు.
రెండు సినిమా లు కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేశాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తో బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు ఈ సినిమా తో నమోదు అవ్వడం ఖాయం అంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా యొక్క అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వార్త ఏంటి అంటే... ఈ సినిమాలో బాలయ్య మరియు శ్రీలీల ల యొక్క కాంబో సన్నివేశాలు ఆహా ఓహో అన్నట్లుగా ఉంటాయట. ఈ మధ్య కాలంలో ఇలాంటి తండ్రి కూతురు సన్నివేశాలు రాలేదు అంటూ చాలా మంది అంటున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. కన్న కూతురు వీడి చాలా సంవత్సరాల పాటు జైలుకు వెళ్లి వచ్చిన తండ్రి యొక్క పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు. ఇక తండ్రి ని వీడి చాలా సంవత్సరాలు దూరంగా ఉన్న కూతురు పాత్రలో శ్రీలీల కనిపించబోతున్నారు. వీరిద్దరు కలిసిన సందర్భంలో సన్నివేశాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన సన్నివేశాలు వీరిద్దరి కాంబోలో ఉంటాయి అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది.. అలాగే ఆ సన్నివేశాలు ఈ సినిమా యొక్క ప్రధాన సీన్స్ లో ఒకటిగా నిలుస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబో సినిమా కు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: