తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు.. ఏంటో చెప్పేసిన అల్లు అర్జున్?

praveen
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందు వరకు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగాడు అల్లు అర్జున్. కానీ పుష్ప సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత మాత్రం ఇక పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. అంతేకాదు అల్లు అర్జున్ కు ఉన్న స్టైలిష్ స్టార్ ట్యాగ్ కాస్త ఐకానిక్ స్టార్ గా మారిపోయింది.ఇక ఇప్పుడు పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా లో నటిస్తూ ఉన్నాడు అల్లు అర్జున్.

 ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఇక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం లాంటివి చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. టీవీ కార్యక్రమాలకు హాజరవ్వడం కాదు ఇక తనదైన శైలిలో పంచులు వేస్తూ కామెడీ పంచుతూ ఉంటాడు. తాను వెళ్లే  బుల్లితెర షో సెట్ మొత్తం సందడి నెలకొనేలా చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్. ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

 తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి అని ఒక పెద్ద సీక్రెట్ బయటపెట్టాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు దేవుడి గురించి తనకు ఉన్న అభిప్రాయాన్ని కూడా బయట పెట్టాడు. తనకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని.. కనిపించే దేవుడు మాత్రం మా నాన్న అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పుష్ప లో కేశవగా నటించిన జగదీష్ ను వెంటనే పార్ట్ 2 షూటింగ్ కు హాజరు కావాలి అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల  విడుదలైన అల్లు అర్జున్ కు సంబంధించి మినీ టీజర్ అటు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: