శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈ దర్శకుడు వరుణ్ సందేశ్ హీరోగా రూపొందినటు వంటి కొత్త బంగారులోకం మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ అడ్డాల కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కి శ్రీకాంత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ... విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా నటించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.
 

ఆ తర్వాత ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత హీరోయిన్ గా బ్రహ్మోత్సవం అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు కొంత కాలం క్రితమే తమిళ్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించినటువంటి అసురన్ మూవీ ని తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో రూపొందించాడు. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీకాంత్ అడ్డాల తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ దర్శకుడు తదుపరి మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూన్ 2 వ తేదీన ఉదయం 11 గంటల 39 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ ని అఖండ సినిమాను నిర్మించినటువంటి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: