2018: నిర్మాతలకు భారీ లాభాలు..?

Purushottham Vinay
2018 కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. మలయాళంలో ఎన్నో రికార్డులు సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మామూలు సినిమాగా మొదలై..ఏకంగా 100 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరింది.రీసెంట్ గా తెలుగులోకి విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ ఇంకా లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా '2018' సినిమా ఓటీటీ లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను సోనిలివ్ దక్కించుకుంది. జూన్ 7 వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక అందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చింది సోనీలివ్ యాప్.సినిమా కథ విషయానికి వస్తే ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు హీరో టోవినో థామస్.అతను ఓ పెద్ద మోడల్ కావడమే లక్ష్యంగా కష్టపడుతుంటాడు. ఇక మత్య్సకార కుటుంబానికి చెందిన అసిఫ్ అలీ.


అలాగే టూరిస్ట్‌లకి తలలో నాలుకలా ఉంటూ కుటుంబాన్ని పోషించే టాక్సీ డ్రైవర్ అజు వర్ఘీస్‌,ఇంకా కేరళ బోర్డర్ లో ఉండే తమిళనాడు గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవర్ కలైయారసన్‌. అలాగే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే కుంచకో బొబన్‌ .. ఇక ఇలా ఎవరి జీవితాలు వారివి, ఎవరి పనులతో వాళ్లు ఎంతగానో సతమతమవుతూ ఉంటారు. కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ల జీవితాలనేవి అనూహ్యమైన ఆటుపోట్లకి గురవుతాయి. అది ఎవరూ కూడా అసలు ఊహించరు.భారీ వర్షాలతో కేరళ రాష్ట్రాన్ని  వరదలు ముంచెత్తుతాయి.దీంతో ఎవరి జీవితాలు ఎలా మారాయి? ప్రాణాలు నిలుపుకొంటే చాలు అనుకునే పరిస్థితుల్లో ఒకరి కోసం మరొకరు ఎలా నిలబడ్డారు అనేది సినిమా కథ.ఈ సినిమా మలయాళంలో పులి మురుగన్ సినిమాని దాటి అక్కడ పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతూ నిర్మాతలకు మంచి లాభాలని తీసుకొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: