తేజా చిన్ననాటి కష్టాలు !

Seetha Sailaja
దర్శకుడు తేజా విలక్షణమైన వ్యక్తిత్వం గల వ్యక్తి సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేసిన తేజా దర్శకుడుగా మారి మరసగా మూడు ఘన విజయాలు అందుకోవడంతో తేజా టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ దర్శకుడుగా మారిపోతాడు అని అనుకున్నారు అంతా. అయితే జరిగింది వేరు మహేష్ బాబుతో తీసిన ‘నిజం’ మూవీ ఫెయిల్ అవ్వడంతో తేజా కెరియర్ గాడి తప్పింది.

అయితే ఆతరువాత తేజా కుటుంబంలో కొన్ని విషాద సంఘటనలు జరగడంతో కొన్ని సంవత్సరాల పాటు తేజా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆతరువాత కొన్ని సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలు సక్సస్ కాకపోవడం అతడికి మరింత షాక్ ఇచ్చింది. అయినప్పటికీ పరిస్థితులతో రాజీపడటం ఇష్టంలేక సినిమాలు తీస్తూ రానా తో తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ అవ్వడంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు.

లేటెస్ట్ గా రానా తమ్ముడు అభిరామ్ తో తీసిన ‘అహింస’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీజా తన చిన్ననాటి కష్టాలను గుర్తుకు చేసుకున్నాడు. తేజా తల్లితండ్రు లకు ఆరోజులలో చాల ఆస్థులు ఉండేవట. అయితే తేజా తల్లి తండ్రులు అతడి చిన్న వయసులోనే చనిపోవడంతో అతడి బంధువులు తేజా ఇంటికి వచ్చి అతడి అక్క చెల్లెళ్ళతో పాటు తేజా ను కూడ చూసుకుంటామని చెప్పి వారి ఆస్థులను మూడు భాగాలుగ పంచుకున్నారట. అయితే ఆస్థులు తీసుకున్నారు కాని వారిని చూడకపోవడంతో చాల కష్టాలు పడి తాను సెటిల్ అయ్యానని తనకు బంధుత్వాల పై పెద్దగా నమ్మకం లేదు అని అంటున్నాడు.

ప్రస్తుతం అభిరామ్ తో తీసిన మూవీ విడుదల రిజల్ట్ ఇంకా తెలియకుండానే తేజా కు రానా మరో అవకాశం ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధం అయింది. ఒక పవర్ ఫుల్ కథను ఎంచుకుని తేజా తీస్తున్న ఈమూవీలో రానా ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. ఈమూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: