ఎన్టీఆర్ చేసిన పనికి ' దేవర ' షూటింగ్ వాయిదా పడేనా....!!

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆదివారం రోజు తన తాతగారి శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వెళ్లి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. జూ. ఎన్టీఆర్ రావడంతో అక్కడ అభిమానులు భారీ స్థాయిలో గుమిగూడారు.చిన్న తోపులాట కూడా జరిగింది.
జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. అయితే తారక్ దేవర షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇచ్చిన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారు. నిన్న తాతగారి శతజయంతి వేడుకలు పూర్తి చేసుకున్న తారక్.. సాయంత్రం ఫ్యామిలీతో వెకేషన్ కి వెళుతూ శంషాబాద్ విమానాశ్రయంలో మెరిశారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్ , లక్ష్మి ప్రణతి దంపతులు.. వారితో పాటు పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ క్యూట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. చిన్న కొడుకు భార్గవ్ రామ్ అయితే తండ్రి చేయి పట్టుకుని విమానాశ్రయంలో బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ఈ చిన్న వెకేషన్ పూర్తయ్యాక తిరిగి ఎన్టీఆర్ దేవర షూటింగ్ తో బిజీ కానున్నారు.
తన కెరీర్ లోనే దేవర బెస్ట్ మూవీ అవుతుందని ఇప్పటికే కొరటాల మాట ఇవ్వడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. సముద్ర తీర ప్రాంతంలో ప్రజలని పీడించే రాక్షసుల అంతం చూసే దేవరగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ ఎపిసోడ్స్ టాప్ నాచ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్రకి ఇప్పటికే ఫియర్ ఆఫ్ గాడ్ అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. యువసుధ సంస్థతో కలసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: