ఒక్కో మూవీకి తలపతి విజయ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా రూపొందిన విక్రమ్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని ఆదుకుంది.

ఈ మూవీ ద్వారా లోకేష్ కు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ లభించింది. అలా విక్రమ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం ... ఈ సినిమాలో విజయ్ హీరో గా నటిస్తూ ఉండడం తో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే మిగతా భాషల సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఈ మూవీ తర్వాత విజయ్ ... వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు విజయ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కోసం విజయ్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: