రీ రిలీజ్ కి రెడీ అవుతున్న బాలయ్య బాబు మూవీ....!!

murali krishna
ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నటుస్తోంది. స్టార్ హీరోలకు సబంధించిన అకేషన్స్ ను సెలబ్రేట్ చేసుకుంటూ..వారి ఎవర్ గ్రీన్ మూవీస్ ను రీరిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా బాలయ్య కెరీర్ లోనే మర్చిపోలేని  సినిమాను రీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు మేకర్స్.
రీరిలీజ్ ల పుణ్యమా అని.. అభిమాన నటుల ఎవర్ గ్రీన్ సినిమాలను మళ్లీ థియేటర్ లో చూసే అవకాశం లభిస్తుంది ఫ్యాన్స్ కు. ఇప్పటికే స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాలను వారి బర్త్ డేల  సందర్భంగా రీ రిలీజ్ చేసి .. మంచి కలెక్షన్స్ రాబట్టడంతో పాటు.. ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచారు. ఇక ఇఫ్పుడు నందమూరి నటసింహం బాలయ్య బాబు సూపర్ హిట్ మూవీ భైరవ ద్వీపం సినిమాను కూడా రీ రిలీజ్ చేయడం కోసం రెడీ చేస్తున్నారు.
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే చాలా మందికి మంచి మాస్ ముందుగా గుర్తొస్తుంది. కానీ బాలయ్య మాస్ తో పాటుగా ఎప్పటికప్పుడు కాస్త కొత్త ప్రయోగాలు చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అలా తాను చేసిన ఎన్నో అడ్వెంచర్ మూవీస్ లో .. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన  కల్ట్ క్లాసిక్ మూవీ అంటే... భైరవ ద్వీపం అనే చెప్పాలి. అటువంటి అద్భుతమైన సినిమాను చాలా మంది థియేటర్లలో చూసి ఉండరు. ఎందుకుంటే ఇప్పటి తరం కుర్రాళ్లు ఆ సినిమా థియేటర్ లో చూసే ఛాన్స్ లేదు.
దాంతో ఈమూవీని  రీ రిలరీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు టీమ్. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టిలో ఒక చిత్రంగా వచ్చిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ అయితే ఇప్పుడు 4K లో రీరిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాదు ఈసినిమాను  బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా.. ఈ జూన్ 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాని ఆడియెన్స్ ఎంతో ఇష్టంగా చూస్తారు. మరి ఇలాంటి సినిమాని బిగ్ స్క్రీన్స్ పై చూడాలి అనుకునేవారికి మాత్రం ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: