చత్రపతి రీమేక్ ఫ్లాప్.. కానీ వినాయక్ మాత్రం గట్టిగానే సంపాదించాడు?

praveen
ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. కానీ సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరో రేసులో నిలిచేందుకు అతను పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన అతనికి మంచి గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదగాలని ఒక పక్కా ప్లాన్ వేశాడు.

 సాధారణంగా రాజమౌళి తెరకెక్కించిన ఏ సినిమాను కూడా ఇతర దర్శకులు రీమేక్ చేయాలని ధైర్యం చేయరు. కానీ అటు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ మాత్రం ఇలాంటి ధైర్యం చేశాడు. రాజమౌళి సూపర్ హిట్ మూవీ ఛత్రపతిని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హిందీ రీమేక్ చేశాడు వి వి వినాయక్. పెన్ స్టూడియో సంస్థ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ లాంటి వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మే 12వ తేదీన సినిమా హిందీలో రిలీజ్ అయింది. అయితే ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ మూవీకి సరైన ఆదరణ దక్కలేదు. దీంతో టాలీవుడ్ లో చాలదు అన్నట్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో కూడా ఫ్లాప్ మూట గట్టుకున్నాడు.

 ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అటు స్టార్ డైరెక్టర్ v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వివి వినాయక్ ఎంత పారితోషకం అందుకున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగులో v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వివి వినాయక్ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నా.. ఆ దర్శకుడితో సినిమా అంటే హీరోలు భయపడిపోతున్నారు. 2018 లో వచ్చిన ఇంటిలిజెంట్ తర్వాత వినాయక్ ఖాళీగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల చత్రపతి ఆఫర్ వచ్చింది. ఈ సినిమా కోసం 6 కోట్ల పారితోషకం అందుకున్నాడట వినాయక్. చాలా రోజుల తర్వాత వినాయక్ తీసిన సినిమా ఫ్లాప్ అయింది. మరి మరో సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: