బాలయ్య.. రవితేజకు సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడా?

praveen
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. 60 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటీ ఇస్తూ ఇంకా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య గర్జిస్తున్నాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇకపోతే మరోవైపు మాస్ మహారాజా రవితేజ కూడా తనదైన శైలులో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు ఏకంగా నందమూరి బాలకృష్ణ మాస్ మహారాజు రవితేజకు సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడు అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. అదేంటి బాలయ్య రవితేజకు హిట్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారు కదా.. దీని వెనుక ఒక పెద్ద సెంటిమెంటే ఉంది. గతంలో బాలయ్య రవితేజ సినిమాలు ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి. కానీ మెజారిటీ సందర్భాల్లో మాత్రం రవితేజకే విజయం వరించింది. రవితేజ నటించిన కృష్ణ మూవీ బాలయ్య నటించిన ఒక్కమగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే.. ఒక్క మగాడు డిజాస్టర్ గా నిలిచింది. కానీ కృష్ణ సక్సెస్ సాధించింది.

 బాలయ్య మిత్రుడు, రవితేజ కిక్ సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. 2011లో బాలయ్య నటించిన పరమవీరచక్ర, రవితేజ నటించిన మిరపకాయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే మరోసారి రవితేజనే పై చేయి సాధించాడు. ఇక ఈ ఏడాది వాల్తేరు, వీర సింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ విషయంలో ముందంజలో ఉంది. ఇప్పుడు బాలయ్య, అనిల్ కాంబో మూవీ.. టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయ్. దీంతో బాలయ్య రవితేజకు హిట్ ఇవ్వబోతున్నాడు. పాత సెంటిమెంట్ ని రిపీట్ చేస్తాడేమో అని అందరూ చర్చించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: