నాగచైతన్య స్థానాన్ని.. అతనితో రీప్లేస్ చేస్తున్న సమంత.. నిజమేనా?

praveen
అక్కినేని వారి మాజీ కోడలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఏం చేసినా కూడా అది వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటిస్తుంది సమంత అన్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో మాత్రమే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని ఉద్దేశంతో అక్కడ అవకాశాలు వస్తే వదులుకోవట్లేదు.

 ఇకపోతే ప్రస్తుతం శివా నిర్వాన దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే శాకుంతలం అనే సినిమాతో ఫ్లాప్ చవిచూసిన సమంత ఖుషి సినిమాపై మాత్రం భారీగానే ఆశలు పెట్టుకుంది.  అయితే ఈ సినిమాతో పాటు సీటాడీల్ సినిమా విషయంలో కూడా కష్టపడుతుంది. ఈ రెండు సినిమాలతో  తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తుంది ఈ అమ్మడు.

 అయితే లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో మరో సినిమా చేస్తుంది సమంత. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ మంచి హిట్ అందుకుంది. ఆ సమయంలోనే నాగచైతన్య సమంతలకు నందిని రెడ్డి ఒక కథ వినిపించడం.. వారు ఓకే చేయడం కూడా జరిగాయి. మధ్యలో విడాకులు తీసుకోవడంతో ఇక ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. అయితే తర్వాత అన్ని మంచి శకునములే సినిమాతో ఫ్లాప్ అందుకున్న నందిని రెడ్డి.. నాగచైతన్య సమంతతో  తెరకెక్కించాలి అనుకున్న ప్రాజెక్టును  మళ్ళీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే సమంత హీరోయిన్గా ఓకే కానీ హీరోగా మాత్రం చైతన్య ప్లేస్ లో మరో హీరోను రీప్లేస్ కోసం వెతుకుతున్నారట. సిద్దు జొన్నలగడ్డతో చైతన్యను రీప్లేస్ చేయాలని చూస్తున్నారట. దీనికి సామ్ కూడా అంగీకరించిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: