10 ఏళ్లకే అలాంటి పని చేసి షాక్ ఇచ్చిన మహేష్ బాబు కూతురు సితార..!?

Anilkumar
సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సితార తరచూ డాన్స్ వీడియోలు తన అందమైన ఫోటోలతో ఊహించని స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకుంటుంది. ఇంత టాలెంట్ ఉన్న మహేష్ బాబు కూతురు మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట సినిమా ప్రమోషనల్ సాంగ్లో తన అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 

అయితే తాజాగా సితార ఘట్టమనేని ఏకంగా ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ మహేష్ బాబు అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రతి ఏడాది కోట్లల్లో సంపాదిస్తున్నాడు మహేష్ బాబు.ఇక ఈ వార్త విన్న చాలామంది నైటిజన్స్ తండ్రి బాటలోనే కూతురు కూడా వెళ్తోందని కామెంట్లు చేస్తున్నారు. పిఎంజి జువెలరీ బ్రాండ్ సితారను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు దానికి సంబంధించిన బ్రాండ్ ప్రమోషనల్ ఇటీవల చిత్రీకరించారు. తాజాగా ఈ యాడ్ షూట్ లో పాల్గొంది సితార .దాదాపుగా ఈ షూటింగ్ మూడు రోజుల పాటు జరిగిందని తెలుస్తోంది. అత్యున్నత టెక్నీషియన్స్ షూట్ చేశారట. అయితే తాజాగా వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను సీతారాతన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అంతేకాదు త్వరలోనే ఆ వీడియో విడుదల కాబోతోంది. అంతేకాదు ఈ ప్రమోషన్ యాడ్లో నటించినందుకుగాను సితార కు పెద్ద మొత్తంలో చెల్లించారట. మొత్తానికి తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది సితార. అంతేకాదు టీనేజ్ లోనే సంపాదించడం కూడా మొదలు పెట్టేసింది సితార. దీంతో సితార కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: