అఫీషియల్ : ఆ తేదీన "ఆది పురుష్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి ఓం రౌత్ దర్శకత్వం వహించగా ... కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
 

ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరి కొన్ని రోజుల్లో భారీ ఎత్తున నిర్వహించబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6 వ తేదీన భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లో జరపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూ వీపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో ... ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: