కీర్తి సురేష్ జీవితంలోకి రానున్న ఆ మిష్టరీ మ్యాన్ ఎవరు ?

Seetha Sailaja
‘దసరా’ ఘనవిజయం సాధించినప్పటికీ ఆమూవీలో ఎంతో కష్టపడి వెన్నెల పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు చెప్పుకోతగ్గ స్థాయిలో టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడంలేదు. దీనికితోడు ఈమె కూడ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే ఒప్పుకోకుండా దర్శక నిర్మాతలను చాలకాలం వెయిటింగ్ లో పెట్టడంతో కీర్తి తో సినిమాలు చేసే వారి సంఖ్య చాల తక్కువగా ఉంటోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హడావిడి చేస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల మధ్య కోలీవుడ్ మీడియా కీర్తి సురేష్ జీవితంలోకి ఒక మిష్టరీ మ్యాన్ వచ్చాడు అంటూ గాసిప్పుల హడావిడి మొదలుపెట్టింది. అంతేకాదు ఆ మిష్టరీ మ్యాన్ దుబాయ్ కి చెందిన ఒక ప్రముఖ మళయాళీ పారిశ్రామిక వేత్త కుమారుడని అతడు కీర్తి తో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో గాసిప్పులు హోరెత్తి పోతున్నాయి.

అంతేకాదు కీర్తి అవకాశం దొరికినప్పుడల్లా దుబాయ్ వెళ్ళి అక్కడ ఆ పారిశ్రామిక వేత్త కొడుకుతో కలిసి రెస్టారెంట్ లకు వెళుతూ పార్టీలు చేసుకుంటోంది అంటూ కోలీవుడ్ మీడియా మరిన్ని గాసిప్పులు పుట్టించింది. దీనితో నిజంగానే కీర్తి ఆ మిష్టరీ మ్యాన్ తో ప్రేమలో పడిందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరచడం మొదలుపెట్టారు.

అయితే ఈ గాసిప్పులు అన్నీ కీర్తీ సురేష్ దృష్టి వరకు రావడంతో ఆమె వాటిని ఖండిస్తూ తనకు కూడ ఆ మిష్టరీ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలి అని ఉందని ఈ వార్తలను ప్రచారంలోకి తీసుకు వస్తున్నవారు ఆ మిష్టరీ మ్యాన్ వివరాలు చెపితే తాను అతడిని వెళ్ళి కలుస్తాను అంటూ జోక్ చేసింది. గత కొంత కాలంగా కీర్తి పెళ్ళి పై రకరకాల గాసిప్పులు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. సినిమాల సంఖ్యను ఆమె తగ్గించుకోవడంతో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదో జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం పరిపాటిగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: