పవిత్ర మాటలలో షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja

ఫిలిం ఇండస్ట్రీలో ఎందరో సెలెబ్రెటీలు రెండు పెళ్ళిళ్ళు అంతకన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు అదేవిధంగా సహజీవనం చేస్తున్న వారున్నారు. అయితే పవిత్ర నరేష్ ల జంటకు మీడియాలో ఏర్పడినంత క్రేజ్ మరే జంటకు ప్రస్తుతం ఏర్పడలేదు అన్న విషయం వాస్తవం. వీరిద్దరు నటించిన ‘మళ్ళీ పెళ్ళి’ మూవీ ప్రమోషన్ లో వీరు చేస్తున్న కామెంట్స్ అదేవిధంగా వీరు బయటపెడుతున్న నిజాలు ఆసినిమాకు మంచి క్రేజ్ ను పెంచుతున్నాయి.
 
 
 వాస్తవానికి ఈవారం విడుదలకాబోతున్న ఈమూవీ ఎంతవరకు సక్సస్ అవుతుందో ఎవరికీ తెలియకపోయినా ఈసినిమా ప్రమోషన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు వీడియోలు చూసి జనం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బహిరంగంగా వీరిద్దరూ అధికారకంగా పెళ్ళి చేసుకోనప్పటికీ భార్య భర్తలు లానే చాల ధైర్యంగా చెలామణి అవుతున్న వీరి పద్ధతి చూసి అందరు బాగా ఆకర్షితులు అవుతున్నారు.
 
 
 న‌రేష్ ప‌విత్ర ఉమ్మ‌డిగా విడివిడిగా కూడ ఈసినిమా ప్ర‌మోషన్‌కు సంబంధించి ఇంట‌ర్వ్యూలు ఇస్తు ఈసినిమా గురించి తమ వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ విషయాలు చెపుతున్నారు. సాధారణంగా సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలు గురించి తెలుసుకోవాలనే ఆతృత సాధారణ ప్రజానీకంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఇంటర్వ్యూలకు విపరీతమైన స్పందన వస్తోంది. త‌న వ్య‌క్తిగ‌త జీవితం జరిగిన కొన్ని విషయాలను వేరే అర్థంలో చూసి తనను చాలామంది టార్గెట్ చేసారని అప్పుడు తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది అంటూ ఆమె కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది.  
 
 
 ప్రస్తుతం తాను స్వేచ్ఛ‌గా ధైర్యంగా స‌మాజంలో తిర‌గ‌గ‌లుగుతున్నానంటే కేవ‌లం న‌రేష్ అండ‌తోనే అని ఆమె అంటోంది. అంతేకాదు తాను నరేష్ తో కలిసి కృష్ణ విజయనిర్మల జీవించి ఉన్న కాలంలో మహేష్ బాబును కూడ కలిసినట్లు పవిత్ర చెపుతోంది. మరి ఈవిషయం పై మహేష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈసినిమా ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో తెలియకపోయినా రియల్ లైఫ్ లో మాత్రం చాలామందికి ఈసినిమా గురించి తెలిసేలా చేసింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: