అది వండి పెట్టమని అభిమానిని అడిగిన బాలీవుడ్ బాద్షా....!!

murali krishna
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం హీరోగా మాత్రమే కాకుండా నటుడిగా, నిర్మాతగా, యాంకర్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు షారుఖ్ ఖాన్.
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు షారుఖ్.ఇప్పటికీ వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కెరియర్ ఆరంభంలో విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన షారుక్ ఖాన్ ఆ తర్వాత హీరోగా మారి బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించాడు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే షారుఖ్ ఖాన్ పఠాన్( Pathaan movie ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు దాదాపుగా 1000 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది.షారుఖ్ ఖాన్ కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ 60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చారు షారూఖ్.పశ్చిమ బెంగాల్ కు చెందిన 60 ఏళ్ల షారూఖ్ అభిమాని శివాని చక్రవర్తి టెర్మినల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు.
శివాని కుమార్తె షారుఖ్ ను కలవాలనే తన తల్లి చివరి కోరికను ప్రస్తావిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఆ వీడియో షారుఖ్ ఖాన్ వరకు చేరింది.మే 22 సోమవారం రాత్రి వీడియో కాల్ ద్వారా శివానితో షారుఖ్ మాట్లాడారు.
వెంటనే ఆ మహిళ చివరి కోరిక తీర్చాడు.కల్ హో నా హో నటుడు తాను జాయ్ పట్టణానికి వచ్చినపుడు ఆమెను తప్పకుండా కలుస్తానని చెప్పాడు.
శివానికి ఆర్థిక సాయం అందిస్తానని, ఆమె కుమార్తె పెళ్లికి కూడా వస్తానని మాట ఇచ్చాడు.తాను వచ్చినపుడు ముళ్లు లేని చేపల కూర వండమని సూపర్ స్టార్ షారుఖ్ శివానిని అడిగాడు.శివాని షారూఖ్ అలా మాట్లాడడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: