పెళ్లి తర్వాత చైతు నాకు అలాంటి కండిషన్స్ పెట్టాడు.. సమంత..!?

Anilkumar
నాగచైతన్య సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే  విడాకులు తీసుకున్నారో అప్పటినుండి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో ఎప్పుడైతే నాగచైతన్య సమంత గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. అప్పటినుండి మీ ఇద్దరికీ సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. తాజాగా మరొక వార్తతో సమంత సోషల్ మీడియాలో నిలిచింది. పెళ్లయిన కొత్తలో నాగచైతన్య తీరు ఎలా ఉండేదో అన్న విషయాన్ని గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది సమంత. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇదిలా ఉంటే ఇక సమంత నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడి ఇరు కుటుంబాలను ఒప్పించి గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక పెళ్లయ్యాక నాలుగు సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట కొన్ని అనుకోని కారణాలవల్ల విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నారు. అయితే విడాకులు జరగకముందు సమంత ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి కొన్ని విషయాలను చెప్పింది. ఇక చైతు పెళ్లికి ముందు ఒకలా ఉన్నాడు.. పెళ్లి తర్వాత మరొకలా ఉన్నాడట.. ఎందుకంటే పెళ్లికి ముందు నేను చైతు కలిసి షాపింగ్ మాల్ కి వెళ్లే వాళ్ళట..

ఇక అక్కడ షాపింగ్ చేసే సమయంలో నాకు అస్సలు టైం తెలియనిచేవాడు కాదు.. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాడు కానీ పెళ్లయిన తర్వాత నాకు చాలా రూల్స్ పెట్టేవాడు.. ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు.. సాయంత్రం 6 దాటితే ఇంట్లో అసలు సినిమాల గురించి మాట్లాడకూడదు.. అన్న కండిషన్ కూడా పెట్టాడు.. కేవలం వ్యక్తిగత విషయాలు మాట్లాడాలని చెప్పేవాడు.. నా పట్ల అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు.. అంటూ చెప్పుకొచ్చింది సమంత. కొన్ని విషయాల్లో నాకు రూల్స్ పెట్టినప్పటికీ నా సొంత విషయాలు మాత్రం అస్సలు కల్పించుకునేవాడు కాదు.. చైతు నేను ఎలాంటి పాత్రను నటించడానికి అయినా ఓకే చేసేవాడు.. వద్దని కూడా చెప్పేవాడు కాదు.. నా సినిమాల విషయంలో మాత్రం నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాడు.. అని చెల్లింది సమంత..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: