నటి రంభ కూతురు ఇప్పుడు ఎలా వుందో తెలుసా...?

murali krishna
తెలుగు లో హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రంభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అప్పట్లో టాలీవుడ్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది.
ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత స్టార్ హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ మరియు నాగార్జున వంటి స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. అలాగే తమిళంలో రజినీకాంత్, అజిత్, విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్ స్టార్స్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను వివాహం చేసుకున్నారు రంభ. పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి ఆమె పూర్తిగా దూరంగా ఉంది. కాగా ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు,ఒక బాబు కూడా ఉన్నారటా.. రంభ సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు తన ఫ్యామిలీకి తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ నే ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రంభ తన పెద్ద కూతురి ఫొటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.కాగా ఆ ఫొటోలలో రంభ కూతురు అచ్చమైన తెలుగు ఆడపిల్లగా ముస్తాబు అయ్యిందటా. రంభ కూతురు పేరు లాన్య ఇంద్రకుమార్. లాన్య చేతిలో బహుమతులు పట్టుకుని ఒక వేదికపై నిల్చున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది రంభ. ప్రస్తుతం ఆ చిన్నారి ఫోటోస్ సోషల్ మీడియాలోబాగా వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అచ్చం తల్లిలాగే ఉందని బుట్టుబొమ్మలా ఉందంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారటా అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: