బాలయ్య నటించిన ఆ సినిమాను.. గవర్నమెంట్ బ్యాన్ చేసింది తెలుసా?

praveen
నటసార్వభౌముడు తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించినా మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా హవా నడిపిస్తున్నాడు. తన నటనతో తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. 60 ఏళ్ల వయసులో కూడా ఇంకా కుర్రాడిలాగానే జోష్ గా కనిపిస్తూ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే బాలయ్య ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించాడు. ఇక ఇందులో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉంటే.. కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.  మరికొన్నిఇండస్ట్రీ హిట్లను కూడా సాధించాడు బాలకృష్ణ. అయితే బాలయ్య ఇలా హీరోగా నటించిన ఒక సినిమాను ఏకంగా గవర్నమెంట్ బ్యాన్ చేసింది అన్న విషయం చాలామందికి తెలియదు. అదేంటి బాలయ్య సినిమాను నిజంగా గవర్నమెంట్ బ్యాన్ చేసిందా.. ఇది ఎప్పుడు వినలేదే అని అనుకుంటున్నారు కదా.. కానీ ఇది నిజమే బాలకృష్ణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం తాతమ్మకల.

 బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. రామకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో సీనియర్ ఎన్టీఆర్, భానుమతి, హరికృష్ణ, బాలకృష్ణ, సాయిబాబు, చలపతిరావు తదితరులు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఇలాంటి సమయంలోనే ఇక కాంగ్రెస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ సినిమాని తీశారు. ఇందులో భాగంగా కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ భానుమతి పాత్ర ద్వారా కొన్ని డైలాగులు చెప్పించారు. ఇక భూ సంస్కరణలను కూడా వ్యతిరేకిస్తూ కొన్ని సీన్స్ చిత్రీకరించారట. అయితే 1974 ఆగస్టు 30న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. కానీ ప్రభుత్వం ఆగ్రహానికి గురైంది. దీంతో రెండు నెలలపాటు ఈ సినిమాను బ్యాన్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఇక తర్వాత పలుమార్పులు చేయడంతో మళ్లీ 1975 జనవరి 8న ఈసినిమాను రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: