హాట్ టాపిక్ గా మారిన తేజ కష్టాలు !

Seetha Sailaja

సినిమాలను చాల డిఫరెంట్ గా తీయడంలో దర్శకుడు తేజా కు ఎంతో పేరుంది. అతడి కెరియర్ ప్రారంభంలో అనేక సూపర్ హిట్స్ కూడ ఉన్నాయి. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ కాంబినేషన్ తో అతడు తీసిన సినిమాలు చాల వరకు విజయవంతం అయ్యాయి. ఆతరువాత మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీసి మెప్పించడంలో తేజ వెనకపడంతో అతడికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

రానా తో తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సక్సస్ అయినప్పటికీ ఆ సక్సస్ ట్రాక్ ను తేజా కొనసాగించలేకపోవడంతో చివరకు రాజీ పడి రానా తమ్ముడు అభిరామ్ తో ‘అహింస’ సినిమాను ఎప్పుడో పూర్తి చేసాడు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈమూవీ జూన్ మొదటివారంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన ఆసక్తికర గాసిప్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది.

ఈసినిమాలో మొట్టమొదటిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న అభిరామ్ తో తేజ తాను కోరుకున్న విధంగా యాక్టింగ్ చేయించడానికి చాల కష్టపడ్డాడు అంటూ ఇండస్ట్రీలో కొందరు గుసగుసలులాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించిన క్లైమాక్స్ లో అభిరామ్ తో యాక్ట్ చేయించడానికి తేజ చాల కష్టపడవలసి వచ్చిందట. ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఒక కొత్త అమ్మాయి చకచకా ఫస్ట్ టెక్ కె యాక్షన్ చేస్తుంటే అభిరామ్ పై మటుకు ఒకటికి రెండుసార్లు పట్టుపట్టి యాక్షన్ చేయించవలసి వచ్చిందట.
దీనితో తన అనుభవాన్ని అంతా రంగరించి ఒక వినూత్న ఆలోచనతో తేజ ఈసినిమాకు సంబంధించి ఒక మాష్టర్ ప్లాన్ వేసాడట. ఈసినిమా క్లైమాక్స్ లో హీరో కనిపించడట. అయితే హీరోనే ఫైట్ చేస్తున్నట్లుగా క్లైమాక్స్ చూస్తున్న ప్రేక్షకులకు అనుభూతి వచ్చే విధంగా తేజా చాల డిఫరెంట్ గా ఈసినిమాను తీసినట్లు తెలుస్తోంది. దీనితో తేజ లాంటి దర్శకుడుకే అభిరామ్ విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మిగతా దర్శకుల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు గాసిప్పులను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: