మరో స్టార్ డైరెక్టర్ తో ధనుష్ సినిమా..!!

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న హీరో రజనీకాంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. రజనీకాంత్ కు సరైన సక్సెస్ లేక ఇప్పటికి చాలా ఏళ్లు అవుతోంది. దీంతో అభిమానుల సైతం చాలా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.. ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉన్నది. అలాగే కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. గతంలో రమ్యకృష్ణ రజినీకాంత్ నటించిన నరసింహ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.

అలాగే ఇందులో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. రజనీకాంత్ తో సినిమా అయిపోయిన వెంటనే.. హీరో ధనుష్ తో కలిసి ఒక సినిమాని చేయబోతున్నారు డైరెక్టర్ నెల్సన్. అయితే ఈ చిత్రాన్ని కమలహాసన్ బ్యానర్ పైన నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు.

డైరెక్టర్ నెల్సన్ కూడా హీరో విజయ్ దళపతి తో బీస్ట్ సినిమాని తెరకెక్కించి భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. రజనీకాంత్ జైలర్ సినిమా పైనే ఆటో రజినీకాంత్ ,డైరెక్టర్ నెల్సన్  కూడా ఈ సినిమా పైన భారీగానే నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎ మేరకు అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి. జైలర్ సినిమా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ చివరి సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: