హాట్ లుక్ లో నడుమందాలతో మైమరపిస్తున్న చాందిని చౌదరి..!

Pulgam Srinivas
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో భాగంగా కొంత కాలం క్రితం చాందిని ... సుహాస్ హీరోగా రూపొందిన కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.
 

ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమాలో చాందిని నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తో ఒక్క సారిగా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెరిగి పోయింది. ఆ తర్వాత చాందిని అనేక సినిమాల్లో ... వెబ్ సిరీస్ లలో అవకాశాలను దక్కించుకుంది. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం రూపొందిన సమ్మతమే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయం సాధించింది. ఈ మూవీ లోని ఈ ముద్దు గుమ్మ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.  

ఇది ఇలా ఉంటే తాజాగా చాందిని తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం చాందినీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: