మూడు రోజుల్లో రీ రిలీజ్ లో "సింహాద్రి" మూవీకి వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కు అద్భుతమైన క్రేజ్ లభించింది. ఈ సినిమాకు గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటు వంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ... భూమిక , అంకిత ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ లుగా నటించారు.

ఇలా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ ల వర్షం కురిపించిన ఈ సినిమాను ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 వ తేదీ నుండి థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూడు రోజుల్లో ఈ సినిమా నైజాం ఏరియాలో 1.12 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సిడెడ్ లో 85 లక్షలు , యుఏ లో 30 లక్షలు , ఈస్ట్ లో 17 లక్షలు , వెస్ట్ లో 14 లక్షలు , గుంటూరు లో 20 లక్షలు , కృష్ణ లో 22 లక్షలు , నెల్లూరు లో 13 లక్షలు , కేరళ లో 24 లక్షలు , తమిళ నాడు లో 11 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13 లక్షలు , యూఎస్ఏ లో 49 లక్షలు , జపాన్ లో 9 లక్షలు , రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 18 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 4.37 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: