మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమా షూటింగ్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న కొన్ని సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి. అవి ఏమిటి... ప్రస్తుతం ఆ చిత్ర బృందాలు ఎవరిపై ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తుందో తెలుసుకుందాం.

రామ్ పోతినేని... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

ప్రభాస్... మారుతి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ప్రస్తుతం బాలకృష్ణ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ నానక్రంగుడ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం బాలకృష్ణ ... కాజల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

పవన్... సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో "బ్రో" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. సముద్ర ఖని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాదులో సాయి తేజ్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ప్రస్తుతం శర్వానంద్ తన కెరీర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ శర్వానంద్ పై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: