రాజమౌళి గూర్చి షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్....!!

murali krishna
దర్శకుడు తేజ బోల్డ్ కామెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అనుకున్నది ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.తేజ చూపించే ఈ ఆటిట్యూడ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ డైరెక్టర్ రాజమౌళి మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు.

దర్శకుడు తేజ బోల్డ్ కామెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అనుకున్నది ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఏమనిపిస్తే తేజ అది అది మాట్లాడతాడని చాలమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ డాషింగ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు ఆయన్ని వివాదాల్లోకి లాగుతాయి. కానీ వాటిని లెక్క చేయకుండా పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు తేజ. తేజ చూపించే ఈ ఆటిట్యూడ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇక విషయానికొస్తే తాజాగా ఆయన `అహింస` అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. రానా తమ్ముడు, నిర్మాత సురేష్‌ బాబు చిన్న కొడుకు అభిరామ్‌ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఒక ఇంటర్వ్యూలో ఆయన దర్శక ధీరుడు రాజమౌళి మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు.

తేజ తీసిన కొత్త సినిమా “అహింస”. జయం సినిమాకు ఈ సినిమా దగ్గర పోలికలు ఉన్నట్లుగా అనిపిస్తుంది అని.. మ్యూజిక్‌గానీ, కథలు ట్రావెలింగ్‌గానీ ఓ సెపరేట్‌ ఫ్లో ఉంటుందని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి దర్శకుడు తేజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను నాలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని, అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్‌ ని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్‌ ఉంటుంది. కొన్ని సీన్స్ కలుస్తుంటాయి. ఎందుకంటే ఆ సినిమాని రాసింది, తీసింది నేనే కదా అని వెల్లడించాడు.తాను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్‌ సినిమాలైనా ఒకేలా ఉంటాయని, అలాగే రాజమౌళి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయని తెలిపారు. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సినిమాలన్నీ ఒకే తరహాలో ఉంటాయి. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్‌, గౌతమ్‌ మీనన్‌ సినిమాలు కూడా అలానే ఉంటాయని తెలిపారు తేజ.

ఇక ఇంటలిజెంట్స్ డైరెక్టర్స్, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్ అనే విషయం గురించి కూడా ఏ సందర్భంగా మాట్లాడాడు. ఇంటిలిజెంట్‌ డైరెక్టర్స్ లో తేజ, సుకుమార్‌, రాజమౌళి, బోయపాటి, వినాయక్‌ వంటి పేర్లని యాంకర్‌ చెప్పగా.. వాళ్లంతా ఇంటలిజెంట్‌ డైరెక్టర్ల అని ప్రశ్నించాడు. వాళ్లు సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్స్ మాత్రమే అని, ఇంటిలిజెంట్‌ డైరెక్టర్స్ కాదన్నారు. అందులో తనని కూడా కలుపుకుని, తాను ఇంటిలిజెంట్‌ డైరెక్టర్‌ ని అయితే అన్నీ హిట్లే ఇవ్వాలి కదా, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయని, ఒకవేళ తాను వేస్ట్ డైరెక్టర్‌ని అయితే అన్నీ ఫ్లాప్‌లే తీయాలి కదా, సక్సెస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇక్కడ ఇంటిలిజెంట్‌ అనేది కాదు, అన్నింటిని దాటుకుని ఓ మ్యాజిక్‌ జరుగుతుందని, అలా సక్సెస్‌లు వస్తాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: