రమాప్రభకు 100 కోట్ల ఆస్తిని ఇచ్చిన శరత్ బాబు...!!

murali krishna
శరత్ బాబు గురించి అందరికి తెలుసు.ఆయన అమాయకత్వం, ఆయన అందానికి అప్పట్లో అంతా  కూడా ఫిదా అయ్యేవారు
ఎంతో మంది అందాల తారలతో నటించిన శరత్ బాబు కేవలం 22 ఏళ్ల లేలేత ప్రాయంలోనే ఆనాటి సీనియర్ నటి తనకంటే అయిదారేళ్ళు పెద్దది అయిన రమాప్రభను పెళ్లి చేసుకున్నారటా.. ఈ పెళ్లి కొన్నాళ్ళ తరువాత విడాకులతో అయితే ముగిసింది.శరత్ బాబు జీవితం పూలపానుపు అయితే కాదు. ఈ రోజుకీ వెనకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి యాభై ఏళ్ల క్రితం ఒక హీరో రాగలిగాడు అంటే దటీజ్ శరత్ బాబు అని చెప్పవచ్చు.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పుట్టి అక్కడే బీఎస్సీ దాకా చదివిన శరత్ బాబు హీరోగా నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగి పుట్టిన జిల్లాకు ఉత్తరాంధ్రాకు ఎంతో పేరు ను తెచ్చారు.నటుడు శరత్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మరియు ప్రతి నాయకుడిగా వెండి తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోశారు. దాదాపు ఐదు దశాబ్దాలు నటుడిగా ప్రస్థానం కొనసాగించాడు.
నటుడు శరత్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మరియు ప్రతి నాయకుడిగా వెండి తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోశారు. దాదాపు ఐదు దశాబ్దాలు నటుడిగా ప్రస్థానం కొనసాగించిన శరత్ బాబు నేడు తన జీవిత ప్రస్థానాన్ని కూడా ముగించారు. అనారోగ్యంతో భాదపడుతున్న శరత్ బాబు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితమే శరత్ బాబు మరణించినట్లు పుకార్లు కూడా వచ్చాయి. కానీ కుటుంబ సభ్యులు ఖండించారు. కాగా నేడు శరత్ బాబు ఆరోగ్యం విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారని సమాచారం.
శరత్ బాబు 1973లో నే నటుడిగా మారారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి గా నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు అద్భుతంగా నటించారు. నెగిటివ్ రోల్స్ లో కూడా ఆయన మెప్పించారు. శరత్ బాబు నటనా జీవితం తిరుగులేని విధంగా అయితే సాగింది.
కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం కొంత వివాదాలతో సాగింది. 1981లో శరత్ బాబు సీనియర్ నటి రమాప్రభని ప్రేమించి వివాహం ను చేసుకున్నారు. కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారని తెలుస్తుంది.ఇప్పటికి రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబుని తీవ్రంగా విమర్శిస్తూ తనకి జరిగిన అన్యాయం తలచుకుని బాధపడుతూ ఉంటుంది. శరత్ బాబు వ్యక్తిత్వాన్ని దూషిస్తూ కూడా ఉంటుంది. అయితే ఈ వివాదంలో శరత్ బాబు కూడా తన మాట వినిపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శరత్ బాబు తన ఆస్తులని కాజేశాడు అని రమాప్రభ పలు సందర్భాల్లో ఆరోపించారటా.కానీ శరత్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రమాప్రభకి రూ 100 కోట్ల ఆస్తి ఇచ్చానని కూడా ఆయన అన్నారు. కానీ నేను అప్పట్లో నా ఆస్తి అమ్మి రమాప్రభ పేరు మీద ఒక ప్రాపర్టీ అలాగే ఆమె తమ్ముడి పేరుమీద మరొకటి అలాగే ఇద్దరి పేరుమీద మరొకటి ఇలా మూడు ప్రాపర్టీలను కొనిచ్చానని ఆయన తెలిపారు…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: