డింపుల్ హయాతి పై పోలీస్ కేసు... ఏం జరిగిందంటే..?

Divya
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి పై తాజాగా క్రిమినల్ కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది..IPS అధికారికాలను ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టడంతో పాటు నానహంగామ చేసిందన్న ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది.. ఐపీఎస్ అధికారి నివాసముంటున్న అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే కారు పార్కు చేసే సమయంలో డింపుల్ హయాతి కారు అధికారికాలను ఢీ కొట్టినట్లుగా సమాచారం.. ఈ కార్యక్రమంలోని డిసిపి వాహనానికి ఉన్న కవర్ని తొలగించడం వాహనానికి అడ్డుగా పెట్టిన కోండ్లను కాలితో తన్నడం వంటివి చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ ఘటనలో అధికారి కారు ముందు భాగం దెబ్బతినిందని ఇదేంటని.. అధికారి కారు డ్రైవర్ ప్రశ్నిస్తే తిరిగి వాగ్వాదానికి దిగింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీంతో డ్రైవర్ డింపుల్ పై పోలీస్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు గత కొద్దిరోజులుగా పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య పలు వివాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఇదే అపార్ట్మెంట్లో..DCP కారు పార్కింగ్ లోనే డింపుల్ కార్ పార్కింగ్ చేయడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయట.. పార్కింగ్ చేయవద్దని చెప్పిన వినకుండా ఈ నటి కావాలనే పార్కు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటన తాజాగా ఈనెల 14వ తేదీన జరిగింది కానీ ఈ విషయం మీడియాకు కాస్త ఆలస్యంగా లీక్ అవడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ కేసు అవ్వడం వల్ల దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ ఇటీవలే గోపీచంద్ అవ్వడం వల్ల దర్యాప్తు చేస్తున్నారు డింపుల్ ఇటీవలే గోపీచంద్ నటించిన రామబాణం చిత్రంలో నటించిన ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు గల్ఫ్ అనే చిత్రంలో నటిస్తున్నది ఆ తర్వాత తమిళంలో కూడా పలు చిత్రాలను నటిస్తున్నట్లు సమాచారం గ్లామర్ వలకబోయడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని కూడా చెప్పవచ్చు. అధికారికంగా కూడా ట్విట్టర్ వేదికగా డింపుల్ ఈ విషయంపై స్పందిస్తూ అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరు అంటూ ట్వీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: