సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ....!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ విషయమైనా ఎంతో ముక్కు సూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేసే తేజ ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఎంతో మంది హీరోలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు అయితే ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించిన తేజ తాజాగా అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన అహింస సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ తేజ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజ తన వృత్తిపరమైన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా తెలియజేశారు.ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ జీవితంలో తనకు జరిగిన అవమానాలు చేదు సంఘటనలను తాను ఎప్పటికీ మర్చిపోనని వాటిని ఎప్పటికీ అలాగే గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. ఎందుకంటే ఇంకోసారి మరి అలాంటి అవమానాలు అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవడం కోసం తాను ఆ విషయాలను మరచిపోనని తెలిపారు.ఓసారి ఇంటిలోన్  తీసుకొని డబ్బు చెల్లించకపోతే బ్యాంక్ అధికారులు తన ఇంటిని జప్తు చేశారని కూడా ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. ఇలా తన ఇంటిపై బ్యాంకులో లోన్ తీసుకున్నాను దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు ఆ సమయంలో తనకు ఎలాంటి సినిమా అవకాశాలు లేవు. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. లోన్ కూడా కట్టలేకపోయానని తేజ తెలిపారు. ఇలా కట్టని సమక్షంలో బ్యాంక్ అధికారులు తన ఇంటిని జప్తు చేయబోతున్నట్లు ఇంటి గోడకు నోటీసులు అతికించారు.అయితే ఎలాగలాగో కష్టపడి బ్యాంకు లోన్ మొత్తం పూర్తి చేశాను. ఇక అప్పటి నుంచి తాను బ్యాంకులో అసలు లోన్ తీసుకోవడం లేదని తేజ తెలియ చేశారు. అంతేకాకుండా లైఫ్ లో ఎప్పుడూ లోన్ తీసుకోకుండా ఉండాలని గుర్తుపెట్టుకోవడం కోసం బ్యాంక్ అధికారులు ఇంటి గోడకు అతికించిన నోటీస్ కూడా అలాగే పెట్టానని ఈ సందర్భంగా తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: