3 రోజులు "బిచ్చగాడు 2" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బిచ్చగాడు మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ నటుడు తాను నటించిన అనేక సినిమాలను ఆ తర్వాత తెలుగు లో విడుదల చేశాడు. కాకపోతే ఏ సినిమా కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిచ్చగాడు రేంజ్ విజయాన్ని అందుకోలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు "బిచ్చగాడు 2" అనే మూవీ లో హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో ఏక్ మినీ కథ మూవీ ఫేమ్ కావ్య తప్పర్ ... విజయ్ ఆంటోని సరసన హీరోయిన్ గా నటించింది  ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్ల షేర్ ... 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

మొత్తంగా ఈ సినిమా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 10.40 కోట్ల షేర్ ... 21.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: