ఆ మూవీ చేసిన తర్వాత అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి... స్వాతి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో స్వాతి ఒకరు. స్వాతి "కలర్స్" అనే టీవీ షో కు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈమె కలర్స్ స్వాతి గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. స్వాతి తన కెరీయర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందులో స్వామి రారా ... కార్తికేయ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్నాయి.

ఈ రెండు సినిమాల్లో కూడా నిఖిల్ హీరోగా నటించడం విశేషం. ఈ రెండు మూవీ లలోని ఈ ముద్దు గుమ్మ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే స్వాతి నిఖిల్ జంటకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా స్వాతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన సినిమా కెరియర్ కు సంబంధించిన అనేక విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా స్వాతి మాట్లాడుతూ ... నేను సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ను మొదలు పెట్టినప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నాను.

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన డేంజర్ మూవీ ద్వారా నేను సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ మూవీ ద్వారా నాకు మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గారు హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలో నేను వెంకటేష్ గారికి మరదలు పాత్రలో నటించాను. ఆ పాత్ర ద్వారా నాకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత కేవలం నాకు సినిమాల్లో మరదలు పాత్రలు మాత్రమే వచ్చాయి.  కానీ అది నా కెరీర్ గ్రాఫ్ కు అడ్డంపడేలా ఉంటుంది అని వాటిని నేను రిజెక్ట్ చేశాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా స్వాతి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: