నాగశౌర్య "రంగబలి" మూవీ మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఈ నటుడు ఇప్పటికే అనేక తెలుగు సినిమా లలో నటించాడు. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఈ నటుడు కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన సినిమా ఛలో. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు ఈ మూవీ తోనే తన కెరీర్ ను మొదలు పెట్టాడు.
 

ఈ మూవీ తో అదిరిపోయే రేంజ్ కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. కాకపోతే ఏ సినిమా కూడా ఛలో రేంజ్ విజయాన్ని అనుకో లేక పోయింది. ఆఖరిగా ఈ యువ నటుడు కృష్ణ వ్రింధా విహారి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ నటుడు రంగబలి అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తూ ఉండగా ... పవన్ బాసంసెట్టి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థలలో ఒకటి అయినటువంటి "సరిగమ" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: